మంచిర్యాల జిల్లామీడియా మిత్రులకు పాత్రికేయులకు ఈ ప్రెస్ మీట్ కు వచ్చిన నా మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్కారము.
తీన్మార్ మల్లన్న జర్నలిస్టుగా మనందరికీ సుపరిచితులే. అవినీతిని అన్యాయాన్ని ప్రశ్నించడం లో మల్లన్న ముందు వరుసలో ఉంటారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే మల్లన్నను నేను ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. కెసిఆర్ ఎన్నికలలో చేసిన ఏ వాగ్దానాన్ని ఇప్పటికీ పూర్తి చేయలేదు. మల్లన్న ఉచిత వైద్యం ఉచిత విద్య సత్వర న్యాయం అవినీతి నిర్మూలన అనే మెనిపే స్టో నాకు ఎంతగానో నచ్చింది కాబట్టి నేను ఎం ఎల్ ఏ అభ్యర్థిగా మంచిర్యాల నియోజకవర్గము నుండి నిలబడుతున్నాను.
ప్రతి అగ్ర పార్టీ బీసీలను అణగద్రొక్కుతూ సరైన పద్ధతిలో టికెట్లు ఇవ్వకుండా బీసీలకు అన్యాయం చేస్తున్నారు మంచిర్యాల జిల్లాలో ఒక బీసీ బిడ్డనైన నన్ను నమ్మి మల్లన్న గారు నాకు మంచిర్యాల టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను నాకి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఇది మన అందరి అవకాశం గా భావించి నాకు పూర్తి సహకారం అందించగలరని కోరుచున్నాను.






