రాచర్ల జూనియర్ కళాశాల లొ ఘనంగా వీడ్కోలు కార్యక్రమం..
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శనివారం రోజున వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలొ విద్యార్ధిని, విద్యార్థులు నృత్యలతో, పాటలతో, ఆనంద కేరింతలతో కార్యక్రమం విజయవంతం చేసారు. అలాగే స్కూల్ గేమ్స్ పెడరేషన్ అఫ్ ఇండియా వారు నిర్వహించిన 67వ జాతీయ స్థాయి జార్ఖండ్ లో నిర్వహించిన ఉషు పోటీలో మరియు తమిళనాడు లో నిర్వహించిన వాలీబాల్ గేమ్స్ లో పాల్గొన్న కళాశాల విద్యార్థులకు మెడల్స్ తో సత్కరించటం జరిగింది.కార్యక్రమనికి ముఖ్య అతిధిగా డాక్టర్ G. సురేంద్ర బాబు, చిన్నపిల్లలా వైద్య నిపుణులు సిరిసిల్ల గారు విచ్చేసారు విద్యార్థులు పరీక్షల సమయం లో ఎలాంటి ఒత్తిడిలకు లోనుకాకుండా దైర్యంగా వుండి క్రమభద్ధంగా చదివి విజయం సాధించాలని చాలా ఉదాహరణ విషయాలు చెప్పి దైర్యాన్ని నింపడం జరిగింది. యువత ఎలాంటి వెసనాలకు లోనుకావద్దని సూచించారు.ఇట్టి కార్యక్రమంలొ ప్రిన్సిపాల్ పి. శైలజ ముఖ్య అతిధి డాక్టర్ సురేంద్ర బాబు ,గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ P. నాగేందర్ రావు , కుకాస్ ఫౌండర్ & డైరెక్టర్ నాగశ్రీనివాస్ , కళాశాల డైరెక్టర్ ఏలూరి రాజయ్య,
అధ్యాపక, అధ్యాపకేతర బృందం,విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.
