గడిచిన నెల రోజుల కాలంలో న్యాయస్థానంలో 07 కేసులలో నిందుతులకు శిక్షలు,జరిమానాలు.*
సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ, న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని, క్షణికావేశంలో చేసిన నేరాలకైనా, శిక్షలు తప్పవని అందరూ గమనించాలని సూచించారు. గడిచిన నెల రోజులలో జిలాల్లో 07 కేసుల్లో గౌరవ కోర్టు నిందుతులకి జైలు శిక్షలు, జరిమానలు విధించినట్టు తెలిపారు.
*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,గారి ఆదేశాల మేరకు ఈ రోజు పద్మనాయక ఫంక్షన్ హాల్లో కన్విక్షన్ రేటు పెంచడానికి జిల్లా పోలీస్ అధికారులతో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లతో ,కోర్ట్ డ్యూటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.*
ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ….
నేర నిరోధన, నేర పరిశోధన అనే అంశాలు విధి నిర్వహణలో అత్యంత కీలకమైనవని,ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని , నేరాలు దర్యాప్తు చేసే సందర్భాల్లో అత్యాధునికమైన నూతన టెక్నాలజీ వినియోగంతో శాస్త్రసాంకేతిక ఆధారాలతో పకడ్బందీగా నేరాల్లో దర్యాప్తు చేసి సాక్ష్యలను కోర్ట్ నందు ప్రవేశ పెట్టినప్పుడు న్యాయస్థానాలు నమ్ముతాయని, నిందితులు చట్టం నుండి తప్పించుకోకుండా కఠిన శిక్షలు పడతాయని, అలాంటప్పుడు నేరస్తుల్లో నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం నేరస్తులకు ఏర్పడుతుందని తెలిపారు.
పోలీసు దర్యాప్తులో భౌతిక సాక్ష్యంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం జోడించి న్యాయస్థానంలో అనుభవజ్ఞులైన ప్రాసిక్యూషన్ అధికారులచే గట్టి వాదనలు వినిపించడంతో నేరాలు ఋజూవు అవుతున్నట్లు తెలిపారు, ప్రతి వారం కోర్టు మానిటరింగ్ సిస్టం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అవసరమైన దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు.
కన్విక్షన్ రేటు పెంచడానికి,నిష్పక్షపాత దర్యాప్తు చేస్తూ నేరస్తుల కు శిక్షలు పడేలా చేయడంలో పోలీస్ అధికారులకు, కోర్ట్ డ్యూటీ అధికారులకు నిర్వహించవలసిన విధి విధానాలపై పబ్లిక్ ప్రసిక్యూటర్స్ దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచరి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు Addl. PP V.Laxmiprasad, Sircilla Sub court,Addl.PP P.Srinivas Pocso court,APP CH. Sandeep PDM court Sircilla,APP Sathish ADM court Sircilla,సి.ఐ లు ,ఎస్.ఐ లు,కోర్ట్ డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.
