త్వరలో నల్లగొండ ఐటీ హబ్ ప్రారంభం
ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు అత్యంత వేగంగా కార్యరూపం దాల్చుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు అత్యంత వేగంగా కార్యరూపం దాల్చుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్ నగరాల తర్వాత ఇప్పుడు త్వరలో నల్లగొండలో ఐటీ హబ్ ప్రారంభం కానున్నదని ఆయన శనివారం ట్వీట్ చేశారు. కొద్ది వారాల్లోనే ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధమవుతున్నదని పేర్కొం టూ, తుది దశ నిర్మాణ పనులు సాగుతున్న ఫొటోలను షేర్ చేశారు.
సింగపూర్ అధ్యక్షుడికి
సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికైన థర్మన్ షణ్ముగరత్నంకు మంత్రి కేటీఆర్ శనివారం ఎక్స్‌వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా ఆయనతో సమావేశమయ్యే అవకాశం లభించిందని దావోస్‌లో షణ్ముగరత్నంతో కలిసి ఫొటోలను పోస్ట్ చేశారు.
