ప్రాంతీయం

మార్కెట్ యార్డ్ నిర్మాణంకోసం కాంగ్రెస్ ధర్నా రస్తారోకో…

127 Views

ముస్తాబాద్/నవంబర్/01; మండలకేంద్రంలో కూరగాయల మార్కెట్ సముదాయ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ధర్నా రాస్తారోఖో చేపట్టారు. ముస్తాబాద్ లో మార్కెట్ కట్టుడు చేతగాదుగాని మునుగోడు దత్తత తీసుకుంటాడటా అవ్వకు బువ్వ పెట్టనోడు చిన్నవ్వకు బంగారు గాజులు చేయిస్తాన్నడటా మంత్రి కేటీఆర్ తరువాయి. వెంటనే మార్కెట్ సముదాయాల పనులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, జిల్లాప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, దుబ్బాక స్వేచ్ఛ రాజు, ఎంపిటిసి, అగుల్ల రాజేశం, బీసీ సెల్ మండల అధ్యక్షులు మాడూరి కిషన్, పట్టణ ఉపాధ్యక్షులు ముక్క నర్సింలు, తలారి నర్సింలు, మచ్చ కొండయ్య, నల్ల వెంకటయ్య, ఫయాజ్ మహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్