ముస్తాబాద్/నవంబర్/02; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఎక్కడా చూసినా వీధికుక్కల భయం వెంటాడుతోంది. స్వైరవిహారం చేస్తూ చిన్నారులను, మహిళలను, వృద్ధులను, మూగజీవాలను వెంటాడి టార్గెట్ పెట్టి గాయాలు చేస్తున్నాయి. ముస్తాబాద్ గ్రామ చివారు నామాపూర్ రోడ్డు ఏంఆర్ గార్డెన్ సమీపంలో దేశేయి బీడీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తూ మేనేజర్ తనభార్య ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. రోజు మాదిరిగానే ఉండగా ఈ క్రమంలో సోమవారం రాత్రి వారి నివాసం లోనికి వచ్చి కుటుంబంపై ఒక్కసారి పిల్లలపై విచక్షరైతంగా దాడిచేసి గాయపరిచాయి అందులో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి సంఘటనలు చాలా గ్రామాల్లో జరుగుతున్నా అధికారులకు కనువిప్పు కలగడం లేక మొద్దు నిద్రకు మొగ్గు చూపుతున్నారు. గ్రామాల్లో పెంపుడకోళ్లు, గొర్రె పిల్లలు, మేక పిల్లలు కనిపిస్తే ఇక వాటికి పండుగే కుక్కల నియంత్రణపై అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. గ్రామాలో జనాభా కంటే కుక్కలే ఎక్కువగా ఉన్నాయంటే ఇక ఏ రేంజిలో పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మండల అభివృద్ధి అధికారి కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు . గ్రామంలో రోడ్ల పైన100లకు పైగా కుక్కలు ఉన్నాయి. వాటి అరుపులకు రాత్రిపూట నిద్ర పట్టడంలేదు. గుంపులుగా చేరి ఊరిలో పరుగులు పెడుతూ చిన్న పిల్లలుసైతం నిద్ర పోనివ్వడం లేదని ప్రజల ఆరోపిస్తూ కుక్కలు స్వైరవిహారం చేస్తూ రోడ్లపైనే ఉండడంచేత ముస్తాబాద్ లో వీధి కుక్కలపై గ్రామపంచాయతీ అధికారులు చర్య తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
