ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే, 2, అవునూర్ గ్రామంలో రైతులు రోడ్డుపై ధర్నా రాస్తారోకోలు చేశారు. ఇప్పటికే పలు గ్రామాలలో ఐకెపి సెంటర్ల వద్ద వరి ధాన్యాన్ని ఆరబెట్టగా కురిసిన వర్షానికి పరుధాలలో ఆరబెట్టి ఉన్న వడ్లు తడిసి ముద్దయినట్లు రైతులు తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలోనే అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి ధాన్యాన్ని త్వరితగతిన సేకరించాలని రైతులు కోరారు. అలాగే రైతులు పండించిన వరి ధాన్యం అకాల వర్షానికి తడిసిన ఎలాంటి తరుగు లేకుండా ఐకెపి సెంటర్లో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. వడగళ్ల వర్షానికి నేల వాలిన వరి పొలంలోనే వడ్లు రాలి ఓవైపు తీవ్ర నష్టం వాటిలిందని రైతులు మొరపెట్టుకున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నష్టపోయిన రైతుల పూర్తి వివరాలు సేకరించి రైతుకు నష్ట పరిహారం చెల్లించాలని రైతులు రోడ్డుపై బటాయించి రాకపోకలు స్తంభింప చేశారు.




