ముస్తాబాద్ జనవరి 31 (24/7న్యూస్ ప్రతినిధి): గాయకుడు, ప్రజా యుద్ధనౌక దివంగత గద్దర్ జయంతి వేడుకలు కన్నెవారిపల్లెలో ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షులు గాదం మల్లేష్ మాట్లాడుతూ జనారణ్యంలో యుద్ధమొనరించిన సైనికుడు గద్దర్ అంటూ గద్దర్ విడుదల చేసిన ప్రకటనలో గద్దర్ సేవలను కొనియాడారు ఆయన పోరాటమే జీవితం.. జీవితమే పోరాటంగా జీవన యానం సాగించిన విప్లవకారుడు గద్దర్ అంటూ బడుగు వర్గాల అభ్యున్నతికై తుది శ్వాశ వరకు ఆయన పోరాడారు అన్నారు ఆయన నేటి వరకు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలుస్తారన్నారు.
