బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సిరిసిల్ల బ్లాక్ సమితి అధ్యక్షులు మాజీ ఎంపీపీ, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ప్రజా సేవలో అమరుడైన నేవూరి వెంకట్ రెడ్డి విగ్రహాన్ని కూడా మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవరాజు కు వినతిపత్రం సమర్పించారు,
వెంకట్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మాజీ జెడ్ పి టి సి సభ్యులు వడ్నాల నర్సయ్య లు ముందుండాలని ఆయన విజ్ఞప్తి చేశారు,
తాము నేవూరి వెంకట్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించాలని సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి పాలక వర్గానికి వినతిపత్రం సమర్పించడం జరిగిందని ఆయన తెలిపారు , నేవూరి వెంకట్ రెడ్డి పాలక వర్గం, నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడానికి తీర్మానం చేసినట్లు వెంకట్ రెడ్డి విగ్రహాం ఏర్పాటు కు కూడా తీర్మాణం చేసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు,
