ప్రాంతీయం

భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి:

138 Views

జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు ఈ రోజు వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి మరియు స్పెషల్ బ్రాంచ్ సి.ఐ సర్వర్, సి.ఐ బన్సీలాల్ మరియు అధికారులతో కలిసి వేములవాడ ములవాగు బ్రిడ్జ్,హన్మజపేట్ వాగు,మర్రిపెళ్లి,రామన్నపెళ్లి చెరువు,మర్రిపెళ్లి వాగు,రుద్రంగి మండలం మానాల వాగులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేసిన అదనపు ఎస్పీ..
ఈ సందర్భంగా ఆదనపు ఎస్పీ మాట్లాడుతూ..భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి అని అత్యవసరం అయితే తప్ప ఎవరూ కూడా బయటకు రకూడదని అని అన్నారు.ఏమైనా సంఘటనలు జరిగితే  డయల్ 100 కి లేదా తగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించినచొ తక్షణ సహాయక రక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుంది అని అన్నారు..గ్రామాలలో పాత ఇండ్లు, గుడిశ లలో, శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయే పరిస్థితిలో ఉంటే పోలీస్ వారికి సమాచారం అందిస్తే సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామని అన్నారు..అలాగే నది తీరా గ్రామాలలో పెద్దలు తమ పిల్లలను నదులలోకి,వాగుల వద్దకి వెళ్లకుండా చూడాలని, చేపలు పట్టే వారు చేపల వేటకు వెళ్లకూడదని అన్నారు..వాగులు వంకలలో కూడా నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమతంగా ఉండాలని అన్నారు.భారీ వర్షాలు కురుస్తున్న  కారణంగా, విద్యుత్ వినియోగ దారులు మరియు ప్రజలు ఇంటిలో  తడి చేతుల తో విద్యుత్ పరికరాలను మరియు తీగలను ముట్టుకో వద్దు.
ముఖ్యంగా బట్టలు ఆరేసే తీగలకు విద్యుత్ వైర్లు తాకకుండా చూసుకోవాలి అని అన్నారు..
*భారీ వర్షాల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణ మొదటి బై పాస్ ను మూసివేయడం జరిగింది*
వర్షపు వదర నీరు డైవర్షన్ కోసం కచ్చా కాలువ త్రవ్వే పనుల దృష్ట్యా మొదటి బై పాస్ మూసి వేయడం జరిగింది అని వాహనదారులు, పట్టణ ప్రజలు సహకరించాలి అని అన్నారు..అదనపు ఎస్పీ  వెంట రూరల్ సి.ఐ బన్సీలాల్, చందుర్తి సి.ఐ శ్రీలత, ఎస్.ఐ లు నాగరాజు,రమేష్ ఉన్నారు..

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7