(గన్నేరువరం జనవరి 30)
చిన్ననాటి మిత్రుడు గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో తల్లడిల్లిపోయారు స్నేహితులు. బాధిత కుటుంబం పెద్దదిక్కును కోల్పోవడంతో అండగా ఉండాలని సంకల్పించారు.. ఆనాటి గురువులు చిన్ననాటి మిత్రులందరు కలిసి రూ. 20.600 సమీకరించి బాధిత కుటుంబానికి అందజేశారు.
గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన గొట్టిముక్కుల శ్రీనివాస్ (55) నెల 15వ తేదీన సంక్రాంతి పండుగ రోజున రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. నిరుపేద కుటుంబనికి చెందిన శ్రీనివాస్ కి భార్య చంద్రకళ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. బాధిత కుటుంబం నిస్సహాయ స్థితిలో ఉంది.
ఈ నేపథ్యంలో తిమ్మాపూర్ మండలం నేదునూరు ప్రాథమికోన్నత పాఠశాల 1981- 82 ఏడో తరగతి పూర్వ విద్యార్థులు, ఆనాటి గురువులు బాధిత కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా అందరు కలిసి రూ 20,600 సమీకరించారు.
సోమవారం సాయంత్రం మాదాపూర్ లో బాధిత కుటుంబానికి జమ చేసిన నగదును అందజేశారు.
తమ మిత్రుడు శ్రీనివాసు అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరమని, ఎల్లవేళలా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చిన్ననాటి మిత్రులు, నాడు చదువు చెప్పిన గురువులు పేర్కొన్నారు.పూర్వ టీచర్లు హనుమంత రెడ్డి, విద్యాసాగర్, చిన్ననాటి మిత్రులు, తదితరులు పాల్గొన్నారు.




