సిద్దిపేట్ జనవరి 27 :ఘనంగా కూర్పురి ఠాకూర్ శతజయంతి వేడుకలు.
భారతరత్న అవార్డు ను ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడీ కి కృతజ్ఞతలు తెలిపిన.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు..
బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీసీ నాయిబ్రాహ్మణ మంగలి సామజిక వర్గానికి చెందిన కర్పూరి ఠాకూర్ 100వ, శతజయంతి వేడుకలు ప్రముఖ సామజిక కార్యకర్త, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా ఠాకూర్ కి కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పురస్కరం “భారతరత్న” అవార్డు ప్రకటించడం పట్ల కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేస్తూ కోహెడ మండలం సముద్రాల పాఠశాలలో కర్పూరి ఠాకూర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ కర్పూరీ ఠాకూర్ కి చిన్నప్పటి నుండి విప్లవ భావాలు ఎక్కువ అనీ కాలేజీ విద్యను మద్యలోనే వదిలేసి భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారనీ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటీష్ ప్రభుత్వం ఠాకూర్ ని 1942- 1945 లో అరెస్టు చేసి జైల్లో వేసిందనీ స్వాతంత్ర్య సిద్ధంచాక మొదట్లో గ్రామంలో టీచర్ గా పని చేసినారనీ బీహార్ లో బీసీ లకు26 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మంగేరీ లాల్ కమీషన్ సిఫారసులను 1978 లో అమలు చేశారు. అని రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో పిడిశెట్టి వెంకట సాయి అక్షర దేవీ, అద్విత, ఆదిత్య, రిషితేశ్వరి, స్వాతి, సంధ్య, లక్ష్మి, రమేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు