24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 27)
సిద్దిపేట జిల్లా కోహేడ మండలం శనిగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కర్ర జయశ్రీ రవీందర్ ని అంగన్వాడీ టీచర్స్ , ఐకెపి సిఏలు మరియు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలో గ్రామానికి చేసిన అభివృద్ధి పనులను కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ కొంపల్లి స్వప్న శశిధర్, ఉప సర్పంచ్ దావ పార్వతి, గ్రామ పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
