ప్రాంతీయం

ఎందరో త్యాగదనుల ఫలితమే స్వేచ్ఛా వాయువులు ఆస్వాదిస్తున్నాం…   గణతంత్ర వేడుకల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కస్తూరి వెంకటరెడ్డి…

180 Views
 ముస్తాబాద్, జనవరి 26 (24/7న్యూస్ ప్రతినిధి) ఎందరో త్యాగధనుల ఫలితంగా నేడు ప్రజలు స్వేచ్ఛా వాయులు ఆస్వాదిస్తున్నారని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కస్తూరి వెంకటరెడ్డి వెల్లడించారు. శుక్రవారం గణతంత్ర వేడుకల్లో భాగంగా వెంకటరెడ్డి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలుత మండల పాత్రిక మిత్రులకు, మండల ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి మనస్ఫూర్తిగా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగధనుల ఫలితమే నేడు దేశ ప్రజలంతా స్వేచ్ఛా వాయువులను ఆస్వాదిస్తూ 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, అందుకే వారిని ఎప్పుడూ మనం స్మరించుకోవాలని వారి త్యాగఫలం ద్వారా మనం ఈరోజు ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామని వారి ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన చట్టం ప్రకారం పారదర్శకతతో ధనిక పేద అనే తేడా లేకుండా ఆప్యాయంగా ఉంటూ అందరినీ సమానంగా ఉండాలని కోరారు. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని అన్నారు. జెండాఆవిష్కరణ అనంతరం నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, పిల్లల హక్కులు- చదువు, సంక్షేమం తదితతర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం బాలికలను ప్రోత్సహిస్తూ జ్ఞాపికలు, పెన్నులు బుక్కులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఒరగంటి తిరుపతి, సీనియర్ పాత్రికేయులు తడుక లక్ష్మీనారాయణ, రామగౌడ్, బైరి బాలరాజు, కూర సంతోష్, సుంచు బాబు, బరిగెల రమేష్, కొల్లూరి శంకర్, గున్నాల పరుశరాములు గౌడ్, రుద్ర శ్రీనివాస్ చారి, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *