రామగుండం పోలీస్ కమిషనరేట్
తేది :26-01-2024
రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు, పోలీస్ అధికారులు సిబ్బందికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
పోలీస్ కమిషనరేట్ కమిషనర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపియస్.
నిబద్దతతో, దైర్యంగా క్రమశిక్షణతో సమర్థవంతంగా పని చేయాలి.
ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన జెండాను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీపీ మేడమ్ మాట్లాడుతూ..,పోలీస్ విధులు సమర్థవంతంగా, డ్యూటీ మైండ్ తో, దైర్యంగా నిర్వహించి, ప్రజల ఆదరాభిమానాలు పొందాలని సూచించారు. డిసిపి స్థాయి అధికారుల నుండి హోంగార్డు స్థాయి అధికారి వరకు గత సంవత్సర కాలంలో ఎదురైన సవాలను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు సిబ్బంది క్రమశిక్షణతో కష్టపడి పని చేస్తారని రాష్ట్రస్థాయిలో మంచి పేరుంది మరల ఆ పేరును కొనసాగించేలా మంచిగా విధులు నిర్వహించారని అదేవిధంగా భవిష్యత్తు లో కూడా కష్టపడి పని చేయాలని వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. ప్రస్తుతం అందరు ఎలాగైతే నిబద్దత, క్రమశిక్షణ తో పనిచేస్తున్నారో అదేవిధంగా భవిష్యత్తులో కూడా పని చేయాలన్నారు.
సమాజంలో ఉన్నటువంటి సంఘవిద్రోహశక్తులను, నేరస్తులను, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని నియంత్రించినప్పుడే సమాజంలోని ప్రజలు ప్రశాంతమైన వాతావరణం లో ఉండగలుగుతారన్నారు. ఏలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొంటానని నా పరిధిలో ఉన్నటువంటి సంఘవిద్రవ శక్తులను, నేరస్తులను, చట్ట వ్యతిరేకమైన కార్యకలపాలకు పాల్పడే వారిని కంట్రోల్ చేస్తూ ఏ ప్రజల కొరకైతే నేను సేవలు అందిస్తునానో వారి కొరకు నిజాయితీగా పనిచేస్తూ భవిష్యత్తులో కూడా ధైర్యంగా ముందుకెళ్తానని వ్యక్తిగత లక్ష్యంతో ప్రజలకు నీతి నిజాయితీతో పారదర్శకతతో ధనిక పేద తేడా లేకుండా ప్రజలందరినీ సమానంగా చూసి పనిచేసి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని రామగుండం పోలీస్ కమిషనరేట్ కు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఏఆర్ అడిషనల్ డీసీపీ రియాజ్ ఉల్ హాక్ గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ఏసీపీ వెంకటేశ్వర్లు, ఏ ఆర్ ఏసీపీ సుందర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లు, సిసియస్ ఇన్స్పెక్టర్ లు, ఏఓ నాగమణి, సీఐ లు, ఆర్ ఐ లు, ఎస్ఐ, ఆర్ ఎస్ఐ లు, సీపీఓ సిబ్బంది, సిఎఆర్ హెడ్ క్వార్టర్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ తదితరులు పాల్గొన్నారు.
