దౌల్తాబాద్: మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ సేవలు మరువలేనివని ఆర్యవైశ్య సంఘం సభ్యులు, యువజన సంఘాల సభ్యులు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో లాల్ బహుదూర్ శాస్త్రీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాభివృద్ధికి లాల్ బహదూర్ శాస్త్రి ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పబ్బ అశోక్, రవి, జిల్లా శ్రీనివాస్, అంజయ్య, శ్రావణ్, నరేష్, ఆంజనేయులు, శ్రీశైలం, శివ, పద్మ, మాధవి, మానస, నవ్య, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్, ఆంజనేయులు, శ్రీనివాస్, నరేష్, మహేష్, ప్రభు, స్వామి, రజనీకాంత్, మునిందర్, శివ, అరుణ్, మల్లేశం, మధు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు..




