ముస్తాబాద్, జనవరి 22 (24/7న్యూస్ ప్రతినిధి) అయోధ్యలో నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం, బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ముస్తాబాద్ మండలంలోని వివిధ ఆలయాల్లో సోమవారం ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగానే హిందువుల మనోభావాలు ఫలవంతమైన ఎన్నో సంవత్సరాల నిరీక్షణ సఫలమైన రోజును పురస్కరించుకొని జగదానందదాయకుడు రామరాజ్య స్థాపకుడు జానకీ రామచంద్రమూర్తి భువిపై అవతరించిన పావనమైన రోజును ముస్తాబాద్ లో వెలసిన మంగళగడ్డ హను
మాన్ ఆలయంవద్ద ఎల్ఈడి స్క్రీన్ ద్వారా అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన రామబంటు సన్నిధానంలో కనులారావీక్షించి ఎన్నో జన్మలపుణ్య ఫలాలను లభించునని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ సందర్భంగా రాజుగురుస్వామి ఆధ్వర్యంలో కనమేని చక్రదర్ రెడ్డి, ఏల్లరాంరెడ్డి, కస్తూరి వెంకటరెడ్డి, చారి, అబ్రమేని దేవేందర్, అన్నం శ్రీధర్ రెడ్డి, భరత్, బండి శ్రీకాంత్, ఈర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




