ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు

26 Views

మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు.

మంచిర్యాల జిల్లా.

ఈరోజు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి మాట్లాడుతూ ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక నమ్మకాన్ని కల్పించిందని , తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒకేసారి మాఫీ చెయ్యడం జరిగిందని అదేవిధంగా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి సారి కుల గణన నిర్వహించడం జరిగింది తద్వారా 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది, మొట్ట మొదటిసారిగా పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగిందని అలాగే విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి సాదించడం జరిగింది. గ్రూప్ 1 , గ్రూప్ 2 నిర్వహించి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది, అదేవిధంగా మంచిర్యాల శాసన సభ్యులు ప్రేమ్ సాగర్ రావు కోరిక మేరకు మంచిర్యాల అభివృద్ధికి అనేక నిధులుకూడా కేటాయించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *