దౌల్తాబాద్: ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి త్యాగరాజు లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ పిఆర్టియు మండల శాఖ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్ ఉద్యోగి హక్కు దీనిని హరించడం సమంజసం కాదని అన్నారు. ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు పరచాలని వారు అన్నారు. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీ లతో విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు నాయకులు రాజసింహ, వేణుగోపాల్, సర్దార్ హుస్సేన్, అనిల్ కుమార్, రాజశేఖర్, విష్ణువర్ధన్ రెడ్డి, రవి, నాగరాజు, వనజ, వినోద, వసంతలక్ష్మి, మహేష్ తదితరులు పాల్గొన్నారు…..
