వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.5
ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో సోమవారం రోజున శివాజీ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక కిషన్. ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమృత రాజమల్లు, ప్యాక్స్ వైస్ చైర్మన్ జంగిటి సత్తయ్య, ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం, వార్డ్ సభ్యులు సతీష్, కో ఆప్షన్ సభ్యుడు చిన్నన్న, ఏటీఎం మల్లేశం సి ఆర్ పి స్వప్న,సీసీ సుదర్శన్ సి డి ఎ అక్షిత, గ్రామస్తులు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.
