ముస్తాబాద్, జనవరి 20 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో విజిలెన్స్ అధికారుల రాకతో కిరాణా షాపులతో పాటు క్రిమిసంహారక, హార్డ్ వేర్ వ్యాపారాలు ఒకేసారిగా నిశ్శబ్దమయ్యాయి. అధికారులు వస్తున్నారని సమాచారం తెలుసుకున్న వివిధ వ్యాపార సంస్థలు అప్పటికప్పుడు మూసివేశారు. ఒకహార్డ్ వేర్ షాప్ లోనే తనిఖీలు అధికంగా నిర్వహిస్తున్నారననే సర్వత్ర విమర్శలకు దారితీసాయి. అది తెలియడంతో కిరాణ జనరల్ స్టోర్ వర్తక వ్యాపారస్తులు మూసివేసి పరుగో పరుగు అంటూ తమ ఇళ్లకు వెళ్లారు. కాలంచెల్లిన వస్తువులను విక్రయిస్తున్నారా అంటూ అర్థంకాక ప్రజలు?.. షాపులు మూసివేయడంపై ప్రజలనుండి పలు విమర్శలు దారితీసాయి. కొంతమంది వర్తక వ్యాపారాలు జిఎస్టి కట్టకుండా నిర్లక్ష్యం విహిస్తున్నారనే నేపంతోనే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారని విశ్వసనీయ వర్గాలద్వారా సమాచారం తనిఖీలు చేస్తున్నట్ల ఓమాట అయితే ప్రధానంగా ఫెర్టిలైజర్స్, హార్డ్ వేర్, కిరాణం షాపులు మధ్యాహ్నం నుండి మూసివేయడం పట్ల స్థానికులకు ప్రశ్నార్థకంగా మారింది.. పాత్రికేయులు తనిఖీ చేస్తున్న అధికారులను ప్రశ్నించగా ఫిర్యాదు మేరకు యంత్రాంగం తనిఖీలు చేస్తున్నామని తెలిపారు.
