రాజకీయం

త్వరలో ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ భేటీ!

221 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 19) హైదరాబాద్

కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో నిత్యం బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు.

అసెంబ్లీలో తప్పించుకుంటే శాసనమండలిలో ప్రశ్నిస్తామని హెచ్చరించారు. నేడు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని కేటీఆర్‌ కలిశారు. ఈ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. శాసనమండలి సభ్యులు పార్టీకి కండ్లు, చెవుల మాదిరిగా పనిచేయాలని సూచించారు.

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందన్నారు. ఈ పోటీలో మనకే ఎడ్జ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు విస్తృతంగా పనిచేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది అంతా వరుసగా వివిధ ఎన్నికలు ఉండనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు అంతా సంసిద్ధంగా ఉండాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. త్వరలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలతో సమావేశం ఉంటుందని అన్నారు. ఆ భేటీలోనే శాసన మండలి పార్టీ నేతలను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *