కొల్లాపూర్ జనవరి 18:కన్నుల పండుగగా శ్రీలక్ష్మి నరసింహుడి బ్రహ్మోత్సవం.
రథోత్సవంలో పాల్గొన్న మంత్రి జూపల్లి.
ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన స్వామి వారి భక్తులు.
సొంత గ్రామంలో కనిపించని మాజీ ఎమ్మెల్యే ఫోటో,
సింగోటం బ్రహ్మోత్సవాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నుండి, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి బారులు తీరుతారు.
ముఖ్యంగా స్వామివారి రథోత్సవం రోజు లక్షలాదిమంది ప్రజలు తరలి వస్తారు. కొల్లాపూర్ ప్రజలకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అంటే ఒక నమ్మకం.
ఆ స్వామి వారిని స్మరించుకుంటే
ఎలాంటి దోషాలైన తొలగిపోతాయని, ఈ ప్రాంతానికి పట్టిన దుష్టశక్తులు కూడా పారిపోతాయని ప్రజలు భావిస్తారు.
అందుకే శ్రీ లక్ష్మీనరసింహస్వామి అంటే ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి.ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై రథోత్సవంలో పాల్గొన్నారు. రథోత్సవాన్ని చూడడానికి ఇసుక పోస్తే రాలనంత జనం తండోపతండాలుగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోడానికి కృష్ణానది జలలాను దాటి భక్తులు వచ్చారు. ఇక అదే సింగోటం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బీరం ఒక్క ఫ్లెక్సీ కూడా కనిపించలేదు.మాజి ఎమ్మెల్యే సొంత గ్రామంలో రథోత్సవ సమీపంలో ఒక్క ఫోటో లేకపోవడం అంటే ఆయన ఎంత పాపాలకు పాల్పడిండో అని ప్రజలు అనుకుంటున్నారు.