Breaking News

మహిళలపై బిజెపి దాడి చెయ్యడం మానుకోవాలి

72 Views

*మహిళలపై బిజెపి దాడి చెయ్యడం మానుకోవాలి

కాలం చెల్లిన మూస పద్ధతిలో మహిళలను అవమానించడం తగదు* *అవహేళనలు ఆపి… మహిళా బిల్లు ఆమోదానికి కృషి చేయండి* *ట్విట్టర్‌లో బిజెపికి కల్వకుంట్ల కవిత హితవు* హైదరాబాద్: మహిళలపై దాడి ఆపాలని బిజెపికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మహిళల గురించి తప్పుడు వ్యాఖ్యానాలతో అవహేళన చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు. వ్యక్తిత్వహరణం చేయడం బిజెపికి అలవాటుగా మారిందని. ట్విట్టర్‌లో తెలంగాణ బిజెపి చేసిన ఓ ట్వీట్ పై ఘాటుగా స్పందించారు.. కాలంచెల్లిన మూస పద్ధతిలో మహిళలలో అవహేళన చేయడం తగదని స్పష్టం చేశారు. మహిళలు ఉన్నత స్థానానికి చేరుకోవడం బిజెపి ఓర్వలేక పోతుందా అని అడిగారు. మహిళ హక్కుల గురించి మాట్లాడుతున్న వారి గొంతు నొక్కడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయని స్పష్టం చేశారు.ఇప్పటికైనా ఇతరులపై నిందలు వేయాలని మానుకొని పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి కృషి చేయాలని బిజెపిని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *