Breaking News

మానేరు వాగులో గుర్తుతెలియని మృతదేహం

197 Views

తంగళ్ళపల్లి మండలం మానేరు వాగులో ఒక గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం బయటపడింది. మండపల్లి గ్రామ శివారులో గంగాధర కిషన్ వ్యవసాయ పొలం వద్ద ఈ మృతదేహం కనిపించడంతో గ్రామపంచాయతీ కార్యదర్శి మూదం ప్రశాంత్ తంగళ్ళపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సుమారు 55–60 ఏళ్ల వయస్సు గల ఈ వ్యక్తి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండగా, అతను సుమారు నెల రోజుల క్రితమే మృతిచెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్ఐ ఆధ్వర్యంలో మృతదేహంపై పంచనామా నిర్వహించగా, అక్కడికే డాక్టర్ వచ్చి పోస్టుమార్టం చేశారు. అనంతరం మృతదేహాన్ని అదే ప్రదేశంలో ఖననం చేశారు.

మృతుడి గుర్తింపు ఇంకా తెలియరాలేదు. అతన్ని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే తంగళ్ళపల్లి పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *