ప్రొఫెసర్ కోదండరాం మర్యాద పూర్వకంగా కలిసిన
టీజేఎస్ జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి
సిద్దిపేట్ జిల్లా 18
సిద్దిపేట జిల్లా ప్రొఫెసర్ కోదండరాం వేములవాడకు వెళుతూ మార్గం మధ్యలో గజ్వేల్ లో గౌరారం దగ్గర మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి శాలువతో సన్మానించారు గజ్వేల్ పరిధిలో ఉన్న ఉపాధి హామీ పథకం నందు పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు తో కలిసి ప్రొఫెసర్ కోదండరాం సారును సన్మానించారు.
ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాదు నుండి వేములవాడ వెళ్తూ మార్గమధ్యలో గజ్వేల్ లో ఆగి టిఫిన్ చేసి కార్యకర్తలను కలిసి మాట్లాడారు ఉపాధి హామీ పథకం నందు పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు సమస్యలను ప్రొఫెసర్ కోదండరాం తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఉపాధి హామీ సిబ్బందిని పర్మనెంట్ చేయడం అలాగే మాకు నెలా రావాల్సిన జీతాలు రావడం గత 18 సంవత్సరాలుగా చేస్తున్న ఇందులో ఎటువంటి ప్రమోషన్లు లేవని ఫణి భారం తగ్గించాలని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ యువజన అధ్యక్షులు కీసర స్వామి జిల్లా కోకన్వీనర్ ప్రవీణ్ కుమార్ మాల మహానాడు నాయకులు తుమ్మ శ్రీనివాస్ ఎమ్మార్పీఎస్ నాయకులు పొన్నాలకుమార్ శ్యామ్ సాయికుమార్ ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు స్వామి చిగురుపల్లి స్వామి నవీన్ తదితరులు పాల్గొన్నారు
