జనగామ జనవరి 16:ఆపదలో అండగా నేనున్నాంటూ..
పదవులు శాశ్వతం కాదు..ప్రజాసేవే వారి ధ్యేయం.
నియోజకవర్గమే కుటుంబంగా భావిస్తున్న వైనం.
సమస్యలు తెలుసుకునేందుకే రాజకీయాల్లోకి..
ప్రజలకు వెన్నుదన్నుగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.
ఆయన కృషికి పలువురి ప్రశంసలు..
ప్రస్తుత కాలంలో సాయం కావాలని అడిగితే చాలు చాలా మంది ఏదో ఒక సాకుతో తప్పించుకుంటున్నారు.
ఏదైనా కష్ట మొస్తే సొంత కుటుంబ సభ్యులు సైతం ముఖం చాటేసే పరిస్థితులు సమాజంలో ఉన్నాయి.. అయితే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
మాత్రం తన నియోజకవర్గంలో ఏవరికి ఏ సాయం కావాలన్నా స్పందిస్తున్నారు..సాయం చేయడం కర్తవ్యంగా భావించి తనవంతు సహాయ సహాకారాలు అందచేస్తు న్నాడు..
అందులో భాగంగా ఇటీవల జనగామ మండలం పెంబర్తిలో తుపాకుల గంగరాజు ఇద్దరు కుమార్తెలు దుర్గమ్మ గుడి వద్ద కారు ఆక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డారు..వెంటనే స్థానిక నాయకులు పల్లాకు సమాచారం అందించారు..వెంటనే చలించిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో క్షతగాత్రులను తన సొంత హాస్పిటల్ అయిన నీలిమా హాస్పటిల్ కు తరలించారు..అక్కడి డాక్టర్లతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా, మనుషు లందరిలో మానవత్వం ఉన్న మనుషులు వేరుగా ఉంటారని, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని చూసి చలించిన ఎమ్మెల్యే పల్లా వెంటనే తన సొంత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న ఆయన సేవలను జనగామ నియోజకవర్గ ప్రజలు కొనియాడుతున్నారు..ఇలాంటి ఆపద్బాంధవుని మన జనగామ ఎమ్మెల్యే గా ఎన్నుకున్నం దుకు ఎంతో గర్వపడుతున్నామని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు..