ఘనంగా సంక్రాంతి వేడుకలు
జనవరి 16 రాజంపేట్
కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలో మరియు తదితర గ్రామాలలో సంక్రాంతి వేడుకలు ప్రజలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గృహాల ముందు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి వేడుకలు పురస్కరించుకొని ఆయా గ్రామాలలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వాహకులు నిర్వహించారు. యువత రంగురంగుల గాలిపటాలు ఎగురవేశారు.





