Breaking News

* ఫైనాన్స్ పేరుతో తక్కువ రోజులలో ఎక్కువ డబ్బులు ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్న భార్య భర్తలను అరెస్టు* బేగంపేట ఎస్సై అరుణ్

135 Views

తేదీ: 15-జనవరి-2024 న్యూస్

ఎస్ఐ అరుణ్ కేసు వివరాలు తెలియపరుస్తూ కొల్తుర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు అయిన భాగవతం శివశంకర్, భాగవతం శశికళ, ఇద్దరు 2022 జనవరి సంవత్సరం లో SHAMIRPET NIDHI LTD ను ఎలాంటి ప్రభుత్వ అనుమతి, లైసెన్స్ లేని కంపెనీ నీ గజ్వేల్ , సిద్దిపేట, ముతంగి, కందుకూరు, దేవరకొండ మరియు నల్గొండ లో ఏర్పాటుచేసి దాని ద్వారా చిట్టీలు మరియు ఋణాలు ఇప్పిస్తామని చెపుతూ రెండు స్కీములను ప్రవేశపెట్టి అందులో భాగంగా వారి వద్ద ఎవరైనా కొంత అమౌంట్ కడితే 45 రోజుల తర్వాత అందుకు వాళ్ళు కట్టిన దానికి పది రేట్ల అమౌంట్ ఇస్తామని, డైరెక్ట్ గా వారి బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని చెక్ లు ఇస్తారు. మరియు ఎవరికైనా ఋణాలు కావాలంటే వారికి కావలసిన రుణాల డబ్బులకి 10% డబ్బులేని బాధితుల వద్ద తీసుకొని 6 నెలల తర్వాత వారికి రుణాల అమౌంట్ నీ ఇస్తామని చెప్పి మోసపూరితంగా బాధితుల చేత డబ్బులు ఇవ్వకుండానే మొత్తం డబ్బులు ఇచ్చినట్లుగా బాండ్ పేపర్ పైన రాసుకొని వారు తీసుకున్న డబ్బులు కట్టలేని పక్షంలో ఇళ్లు కానీ స్థలాలు కానీ ఆ కంపెనీ పేరు మీద ఉండేటట్లు రాయించుకుంటారు… బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఎల్కల్ గ్రామానికి చెందిన పిట్ల కృష్ణ, ఇంటేనుక నరసవ్వ, పిట్ల చిన్న వెంకటయ్య, మర్కంటి రాజు మరియు దొనేపల్లీ లింగం, తదితరుల దగ్గర మొత్తంగా 2,60,000 తీసుకుని అందుకు పది రెట్లు 45 రోజుల తర్వాత 10 రేట్ల డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా వారిని మోసం చేశారు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుతో బేగంపేట ఎస్ఐ అరుణ్ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.

పై నిందితులిద్దరిని అరెస్టు చేసి వారిద్దరి దగ్గర SHAMIRPET NIDHI LTD కి సంబందించిన రికార్డ్స్ లను , బాండ్ లను, స్టాంప్ స్వాధీనం చేసుకొని పై ఇరువురిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం పంపించడం జరిగిందని ఎస్ఐ ఒక ప్రకటనలో తెలిపారు..

ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాలలోకి వచ్చి ఫైనాన్స్ ఇస్తాము డబ్బులు రెట్టింపు చేస్తాము రకరకాల మోసాలతో గ్రామాలలో తిరిగే వ్యక్తులను నమ్మవద్దని వారికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *