ఆధ్యాత్మికం

ఖాసింపేటలో ఘనంగా ముగ్గుల పోటీలు..

188 Views

(గన్నేరువరం జనవరి 15)

గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలో మహిళా భవనం వద్ద క్రీర్తి శేషులు గంప నాంపల్లి ,నర్సమ్మ స్మారక ముగ్గుల పోటీలను సర్పంచ్ గంప మల్లేశ్వరి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగు రంగుల ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలు, యువతులకు,బహుమతులు అందజేశారు.

ప్రథమ బహుమతిగా దర్శనాల రమ్య , ద్వితీయ బహుమతిగా తిప్పర్తి అనూష, తృతీయ బహుమతిగా కర్నే పద్మ చీరలు అందుకున్నారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సల్టేషన్ బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ..

కీర్తిశేషులు గంప నాంపల్లి, నర్సమ్మ పేరు మీద 15 ఏండ్లుగా ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ మహిళలు భాగస్వాములై ముగ్గుల పోటీలో పాల్గొన్న విజేతలకు, ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేస్తున్నామన్నారు. గ్రామ అభివృద్ధి తో పాటు సంప్రదాయాలను, పండుగలను కూడా ప్రజలతో కలిసి ఘనంగా
చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇదే స్ఫూర్తి ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ఎలేటి స్వప్న చంద్రారెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు నంగునూరి శంకర్, బద్ధం రమణా రెడ్డి, వార్డు సభ్యులు బుర్ర ఎల్లయ్య గౌడ్, ర్యాగటి వీరయ్య, సందవేణి సునీత,బొజ్జ రేణుక, కో ఆప్షన్ సభ్యులు ఆకెన వైకుంఠం, నాయకులు బొజ్జ మల్లేశం, సంద వేణి ఐలయ్య, వివొలు, సి ఏలు, మహిళలు,యువతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
కొమ్మెర రాజు తిమ్మాపూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *