రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్ల పేట గ్రామంలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం చింతల్ టానాకు చెందిన రంగు దేవయ్య(50) అనే వ్యక్తి బ్రతుకుతెరువు కోసం కోరుట్ల ప్లేట్లో వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. గతంలో చేసిన అప్పులు తీవ్రం కావడంతో మద్యానికి బానిస అయ్యాడు. ఇదే క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన దేవయ్య ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య బాలామణి, కుమారుడు అజయ్, కూతురు సౌమ్యాలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
