దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.. శుక్రవారం వెంకటంపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం, అంబేద్కర్ భవన్ ప్రారంభించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలు పటిష్టంగా ఉన్నప్పుడే రాష్ట్రాలు,దేశాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయని అన్నారు.. గ్రామ పంచాయతీ కార్యాలయలు సంక్షేమ పథకాలు అమలుకు, ప్రభుత్వానికి ప్రజలు మధ్యలో వారిదిగా ఉంటాయి అని అన్నారు.. తన ఎన్నికల్లో తన గెలుపుకు సహకరించిన గ్రామ ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. ఎన్నికల్లో చెప్పినట్టుగానే ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల పెంచడం జరిగిందని గుర్తు చేశారు.. మిగతా గ్యారంటీలను వంద రోజుల్లో తప్పకుండా అమలు చేస్తామని అన్నారు.. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు..




