రామగుండం కమీషనరేట్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు.
కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సిపి
ప్రజాపాలన దినోత్సవ వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. అధికారులు , సిబ్బందితో జాతీయ గీతాన్ని, రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ గారు ప్రజాపాలన దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేసారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పోరాడి సెప్టెంబర్ 17న ప్రజాపాలనలోకి వచ్చిన రోజు అని కావున తెలంగాణ ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు అన్నారు. ప్రజల పై జరిపే హింస పెరిగిపోవడం తో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ, కొమురం బీమ్ వంటి ఎంతోమంది పోరాటయోధులు పోరాటాలు సాగించరని వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని అప్పటి ప్రధాని నెహ్రు, ఉపప్రదాని హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ల చోరువతో జనరల్ చౌదరి అధ్వర్యంలో సైనిక చర్య జరిపి నిజాం ప్రాంతాన్ని భారత్ లో కలపడం జరిగిందని, ఇందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు.
ఈకార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్ , ఆర్ఐ వామన మూర్తి, శ్రీనివాస్, మల్లేశం , గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని టూ టౌన్ సిఐ ప్రసాద్ రావు, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్ లు ఎస్ఐ లు ఆర్ఎస్ఐ సీపీఓ సిబ్బంది, వివిధ వింగ్స్ సిబ్బంది, ఏఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.




