ప్రాంతీయం

చైనా మాంజా నిషేధం

225 Views

రామగుండం పోలీస్ కమీషనరేట్

తేది :14-01-2024

రామగుండం కమిషనరేట్ పరిధిలో చైనా మంజా నిషేదం:

నిబంధనలకు విరుద్ధంగా ఎవరి ప్రవర్తించిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు: సీపీ రామగుండం

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో చైనా మాంజ పై నిషేధం. ఎవరైనా చైనా మంజా అమ్మిన, దాని వలన ఎవరికైనా ప్రమాదం జరిగిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. సంక్రాంతి సంద‌ర్భంగా చైనా మాంజ ఎక్కువ‌గా విక్ర‌యించే దుకాణాల పై అధికారులు తనిఖీ లు నిర్వహించడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్.,(డిఐజి) ఒక ప్రకటన లో తెలిపారు.

చైనా మాంజ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, చైనా మాంజ‌ను ఉప‌యోగించే గాలి ప‌టాలు ఎగుర‌వేసే క్రమంలో ఎన్నో ప‌క్షులు, సాధారణ ప్రజలు ప్ర‌మాదానికి గురవుతారు. అదేక్ర‌మంలో గాలిప‌టాలు ఎగుర‌వేసే వ్య‌క్తులు కూడ ప్ర‌మాదానికి గురైన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో చైనా మంజా నిషేదించం అని సీపీ గారు తెలిపారు.

చైనా మాంజాపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. చైనా మాంజాను అమ్మితే ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా కూడా వుంటుంది అని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *