జగిత్యాల జనవరి 12: కెరటం నాకు ఆదర్శం…లేచి పడుతున్నందుకు కాదు పడిన కూడా లేస్తున్నందుకు అంటూ యువతలో చైతన్యం నింపిన స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద – జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్.
జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జగిత్యాల జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ .
ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ
స్వామి వివేకానంద అంటే ఒక చైతన్యం,నాడు మన దేశం స్వాతంత్రం కోసం పోరాడిన ఎందరో వీరులకు ఆయన ఆదర్శం. నేడు లక్ష్యం కోసం శ్రమించే యువత గుండెల్లో నిత్యం రగిలే జ్వాల అని అన్నారు.
అమెరికాలోని చికాగోలో ఆయన చేసిన ప్రసంగం ఈనాటికీ ప్రకంపనలుసృష్టిస్తూనే ఉంది.అందుకే స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ పి.డి నరేష్ మరియు జిల్లా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు…



