ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి లో శుక్రవారం స్వామి వివేకానంద 161 వ జయంతి వేడుకలను స్వామి వివేకానంద యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన మహనీయులని గుర్తు చేశారు.చికాగో మహాసభల్లో పాల్గొని తెలుగు వారి గొప్పతనాన్ని చాటి చెప్పిన ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద అని అన్నారు.నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సమాజం లో అన్ని రంగాలలో ముందుండి మరింత చైతన్య పరచాలని పలువురు సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాశం సరోజన దేవి రెడ్డి, ఉప సర్పంచ్ దేవయ్య,సింగిల్ విండో వైస్ చైర్మన్ మరియు విగ్రహ దాత బుగ్గ కృష్ణమూర్తి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు చక్రధర్ రెడ్డి,మర్రి శ్రీనివాస్ రెడ్డి,గుడ్ల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీశైలం,పిల్లి రవి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
