రాజకీయం

మైనారిటీ ఓట్ల కోసమే కాంగ్రెస్ గైరాజర్

100 Views

మైనారిటీ ఓట్ల కోసమే రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ గైర్హాజరు – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.

వందల ఏండ్ల హిందువుల కళ అయోధ్య రామ మందిర సాకారం అవుతున్న వేళ రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిన కూడా కాంగ్రెస్ అగ్ర నాయకులు ప్రారంభ కార్యక్రమానికి నిరాకరించాడాన్ని ఖండిస్తూ ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ వందల ఏండ్ల హిందువుల కళ అయోధ్య రామ మందిరం సుప్రీం కోర్టు తీర్పుతో నిర్మాణం పూర్తి చేసుకొని జనవరి 22 న ప్రారంభం కానున్న సందర్భంగా అయోధ్య రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశంలో ఉన్న ఉన్న ప్రముఖులకు మరియు రాజకీయ పార్టీల అగ్ర నాయకులకు ప్రారంభోత్సవ ఆహ్వానం పంపితే దాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కేవలం మైనారిటీ ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేస్తోందని అన్నారు. జిల్లా లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రామ మందిర ప్రారంభోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నార అని తెలుపాలని డిమాండ్ చేశారు.

ప్రతి గ్రామంలో అయోధ్య రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి అయోధ్య రామ మందిర పూజిత అక్షింతలు కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఈ విషయాలు అన్ని ప్రజలు గమనిస్తున్నారని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు దొంగ గ్యారింటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని అన్నారు. దేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో విజయం సాధించి మూడో సారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపారు.

పెద్దపల్లి పార్లమెంట్ లో కూడా బీజేపీ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో అన్ని వర్గాల ప్రజల కోసం మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని మరియు దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని తెలిపారు. మోదీ గారు చేసిన అభివృద్ది మరియు అమలు చేసిన సంక్షేమ పథకాలే బీజేపీ పార్టీని మరొకసారి అధికారంలోకి తీసుకవస్తుందని తెలిపారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో మరియు అక్షింతలు పంపిణీ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రజినిష్ జైన్, నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, అరుముళ్ళ పోశం, తుల ఆంజనేయులు, ముదాం మల్లేష్, బొద్దున మల్లేష్, పట్టి వెంకట కృష్ణ, కషేట్టి నాగేశ్వర్ రావు, రాచర్ల సంతోష్, బోయిని హారి కృష్ణ, గాజుల ప్రభాకర్, అశోక్, బల్ల రవి, తరుణ్, శ్రవణ్ మరియు తతిదరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *