Breaking News

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఘన స్వాగతం…

88 Views

ఏప్రిల్ 16, 24/7 తెలుగు న్యూస్:ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఘన స్వాగతం పలికిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ముందుగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నెరదిగొండ టోల్ ప్లాజా వద్ద వేలాది మంది కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు అనంతరం కేటీఆర్తో కలిసి సుమారు 1000 కార్లతో గాయత్రి గార్డెన్ చేరుకున్నారు.

అనంతరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 4 నెలల క్రితమే కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించారు.

ఆత్రం సక్కు కి ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ ఆయనను ఆదిలాబాద్ అభ్యర్థిగా ప్రకటించారు.

అధికారం పోగానే కొంతమంది వేరే దారులు వెతుకున్నా సరే…ఆత్రం సక్కు మాత్రం ఏ ప్రలోభాలకు లొంగలేదు.

మంత్రి పదవులు, పెద్ద పదవులు చేసిన వారు అధికారం పోగానే పార్టీ నుంచి జారుకున్నారు.

కానీ ఆత్రం సక్కు మాత్రం విలువతో కూడిన వ్యక్తి. పార్టీ కష్టకాలంలో కూడా పార్టీతోనే ఉన్న నిజాయితీ గల వ్యక్తి.

అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

రుణమాఫీ, రైతు భరోసా, ఇంట్ల ఇద్దరు ముసళోళ్లు ఉంటే ఇద్దరికీ 4 వేలు ఇస్తా అంటూ డైలాగులు కొట్టి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు.

డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి అన్న మాటను గుర్తు చేసుకోవాలె.

డిసెంబర్ 9 నాటి ప్రమాణం స్వీకారాన్ని డిసెంబర్ 7కే చేసిండు. అధికారమేమో రెండు రోజుల ముందే. రుణమాఫీ మాత్రం 4 నెలలైనా చేయలే.

ఇప్పుడు ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ చేస్తా అని కొత్త పాట ఎత్తుకున్నాడు

*రైతులు కర్రు కాల్చి వాత పెడతారన్న భయంతో కొత్త వాయిదా పెట్టిండు.

*రుణమాఫీ కావాలన్న, రూ. 2500 కావాలన్న, ముసలోళ్లకు రూ. 4 వేలు కావాలన్నా బీఆర్ఎస్ గెలవాల్సిందే.*

*లేదంటే రేవంత్ రెడ్డి ఉన్న అన్ని పథకాలను ఇచ్చ కొట్టుడు ఖాయం.*

*లంకె బిందెలు ఉంటాయని అనుకొని వచ్చినా అంటాడు రేవంత్ రెడ్డి*

*లంకె బిందెల కోసం తిరిగేటోళ్లు పచ్చి దొంగలు ఉంటారు.*

*రైతు బంధు ఏమైందయ్యా అంటే ఓ మంత్రి చెప్పుతోని కొడుతా అంటాడు.*

*కేసీఆర్ గారు 70 లక్షల మంది రైతుల ఖాతాలో రూ. 70 వేల కోట్లు రూపాయల జమ చేసిండు.*

*రైతులు ఇప్పుడు చెప్పుతో కొట్టినట్లు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరముంది.*

*కేసీఆర్ గారు ఉన్నప్పుడు కడుపు నిండా నీళ్లు, 15 రోజుల్లో పంట కొనుగోళ్లు ఉంటుండె.*

*కాంగ్రెస్ వచ్చింది. కరువును తీసుకొచ్చింది. ఇవ్వాల గ్రామాల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.*

*గతంలో విష రోగాలు, అతిసారా అనే వ్యాధులు ఉండే. మిషన్ భగీరథ కార్యక్రమంతో కేసీఆర్ వాటిని లేకుండా చేశారు.*

*మళ్లీ పాత రోజులను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది.*

*ప్రజలు మోసపోవాలనే కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి నిజాయితీ చెప్పి మరి మోసం చేసిండు.*

*తప్పు రేవంత్ రెడ్డి కాదు. మనదే.*

*మనం చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పుకోవటంలో విఫలమయ్యాం.*

*లక్షా 63 వేల ఉద్యోగాలను మనం విద్యార్థులకు చెప్పుకోలేపోయాం మన మీద జరిగిన విష ప్రచారాన్ని సరిగా తిప్పికొట్టలేకపోయాం.*

*ఇవి మన అందరి భవిష్యత్, పార్టీ భవిష్యత్ కు సంబంధించిన ఎన్నికలు.*

*కాంగ్రెస్, బీజేపీ మీద ప్రజలు మంట మీద ఉన్నారు.*

*కష్టపడి పనిచేస్తే ఆదిలాబాద్ గెలవటం పక్కా.*

*బీజేపీ, కాంగ్రెస్ చేసిన, చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించటమే మన పని.*

*కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిందా?*

*మరి నోటిఫికేషన్ ఇవ్వకుండా మన ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు.*

*మంది పిల్లలను మా పిల్లలు అని చెప్పుకునే రకం కాంగ్రెస్ పార్టీ.*

*ఏడాది లో 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న కాంగ్రెస్ హామీని యువతకు మనం చెప్పాలె.*

*టెట్ పరీక్ష కోసం మనం 400 ఫీజు పెట్టాం. మేము వస్తే ఫ్రీ గా ఎగ్జామ్ పెడతామన్నారు. కానీ టెట్ పరీక్ష కోసం రూ. 2000 ఫీజు పెట్టారు.*

*మన డీఎస్సీలో 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఇది దగా అన్నాడు రేవంత్ రెడ్డి.*

*25 వేల ఉద్యోగాల ఖాళీ ఉన్నాయని అన్న రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు 10 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిండు.*

*టెట్, డీఎస్సీ, గ్రూప్స్ అన్ని విషయాల్లో విద్యార్థులను పచ్చిమోసం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ*

*మాటలేమో ఆకాశంలో చేతలేమో పాతాళంలో.*

*దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కేసీఆర్ సర్కార్.*

*ఉద్యోగులతో పేగు బంధమని చెప్పి అత్యధిక జీతాలు ఇచ్చాం. కానీ జీతాలు ఆలస్యమయ్యాయని వాళ్లు దూరమయ్యారు.*

*కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైన కారణంగా కాస్త జీతాలు ఆలస్యమయ్యాయి.*

*ఐతే వాళ్లందరికీ మనం సరిగా తీరుగా మనం చేసిన పనులను చెప్పుకోలేకపోయాం.*

*గిరిజనుల కోసం కేసీఆర్ తాండాలను పంచాయితీలు చేశారు. 6 శాతం రిజర్వేషన్లు ఇచ్చికున్నాం, సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాం. పోడు భూములను పంచినాం.*

*కొమురం భీమ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసింది కేసీఆర్

ఇంద్రవెల్లిలో కాల్చి చంపిన కాంగ్రెస్ ప్రభుత్వం…సిగ్గు లేకుండా, మానం లేకుండా మళ్లీ ఇంద్రవెల్లికి వచ్చి గిరిజనులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7