మంచిర్యాల నియోజకవర్గంలోని వేంపల్లి గ్రామంలోని SVS ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన *బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల, విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.
ఈ కార్యక్రమం సందర్భంగా నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ,ఎన్నికల్లో మన పార్టీ ఓడిపోయిందని బాధపడకుండా ,ప్రతిపక్ష హోదాలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా, ప్రజల క్షేమమే ధ్యేయంగా పనిచేద్దామని,రాబోయే స్థానిక ఎన్నికల్లో మరియు పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలిపే దిశగా పనిచేద్దామని,ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి మళ్లీ తెలంగాణ గడ్డపైన గులాబీ జెండా ఎగరవేయాలని సూచించారు..అదే విధంగా ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా తాను అండదండగా ఉంటానని మరియు ప్రతి కార్యకర్త తన కుటుంబ సభ్యుడాని ,మీలో ఎవరికి ఏ కష్టం,ఆపద వచ్చినా క్షణంలో మీ ముందు ఉంటానని కార్యకర్తలకు మనోధర్యాన్ని ఇచ్చిన మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల.బిఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మరియు మున్సిపాలిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు , కౌన్సిలర్లు, సర్పంచులు ,ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ,ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, యువజన విభాగ నాయకులు విద్యార్థి ,విభాగ నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలు హాజరైనారు..




