బీర్కూరులో గడపగడపకు కాంగ్రెస్
అక్టోబర్ 26
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో 2వ రోజూ గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. అనంతరం బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాసుల రోహిత్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి సంతకం గా రెండు లక్షల రుణమాఫీని రైతులకు అందిస్తామన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందించడం జరుగుతుందన్నారు. రైతులు పండించిన ధాన్యానికి 2500 మద్దతు ధర కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది అన్నారు. రైతులతో పాటు కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకాలను రూపొందించడం జరిగిందన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీర్కూరు మండల అధ్యక్షుడు బోయిని శంకర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దొంతూరం కాశిరం,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు యమ రాములు, మాజీ సర్పంచ్ సనేపు గంగారం, కిసాన్ కెత్ అధ్యక్షులు పిరన్న,ఎస్ సి సెల్ మండల అధ్యక్షులు సెల్ అధ్యక్షులు రూప్ సింగ్,బోయినిగంగాధర్,నగేశ్వరావు,రఫీ, గొన్ల రాజు,సత్యం,కృష్ణకుమార్, మంద సాయిలు,ఐనాల సాయిలు, కృష్ణ కుమార్, రషీద్, మహారాజ్ గంగారాం,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
