Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

సూర్యుడు ఉత్తరాయానికి వచ్చే ధనుర్మాసమే శుద్ధ తొలి ఏకాదశి…..

355 Views

ఎల్లారెడ్డిపేట మండలంలో తొలి ఏకాదశి (ముక్కోటి) వేడుకలు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ మహావిష్ణువుకు పూజలు నిర్వహించారు. శనివారం ఆలయానికి భక్తులు అధికంగా తరలివచ్చారు అదేవిధంగా మండల కేంద్రంతో పాటు అన్ని శివాలయాలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో దర్శనానికి భక్తులు అధికంగా వచ్చి దర్శించుకున్నారు స్వామి వారి ఆలయంలో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించినట్లు వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ గడ్డం జితేందర్ వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్ మీడియాతో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ హరిహరాయలు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇస్తాడని ఇది మహా భాగ్యమని అన్నారు శివుడు నారాయణుడు భక్తులకు చిరకాలం చల్లంగా చూడాలని భక్తులను ఆశీర్వదిస్తారని నమ్ముతారు ముక్కోటి ఏకాదశి కి దీపారాధన తులసి మాలలు పండ్లు పొలాలు భక్తులు సమర్పించారు నారాయణోడి దర్శనం చేసుకున్న వారికి భక్తులకు అసౌకర్యం కలగకుండా తీర్థప్రసాదాలు అరటిపండ్లు సిరా కుడిక అందించారు ముక్కోటి ఏకాదశికి శ్రీ మహా విష్ణువు కొలువై ఉంటాడని ఇదే రోజు ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారని ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు పూజారి నవీన్ భక్తులకు గీత ఉపదేశం చేశారు శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యం మహా పుణ్యమన్నారు. కార్యక్రమంలో అశేష జనం భక్తులు పిల్లాపాపలతో తరలివచ్చారు. సంవత్సరానికి 12 సార్లు ఏకాదశి వస్తుందని తొలి ఏకాదశి సూర్యుడు ఉత్తరాయణానికి వచ్చే ధనుర్మాసం రోజే ముక్కంటే ఏకాదశిగా పిలుస్తామని ఆలయ కమిటీ పేర్కొంది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *