ప్రాంతీయం

కాసిపేట లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం

26 Views

మంచిర్యాల జిల్లా.

అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో లో భాగంగా ఈరోజు కాసిపేట పి హెచ్ సి  లో కోపము, నిరాశ మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు రావడానికి గల కారణాలు మరియు వాటిని యోగాలో భాగమైన ప్రాణాయామం, ధ్యానం , యోగనిద్ర ద్వారా ఏవిధంగా జయించవచ్చు అని ఆయుష్ జి ఎ డి దేవపూర్ యోగా ఇన్స్ట్రక్టర్స్ పి.నాగార్జున, జి. గీతాదేవిలు తెలియజేసారు.కొన్ని యోగాసనాలు, ప్రాణాయామాలు అక్కడి వారికి వివరించి చేయించడం జరిగింది. యోగా ప్రాముఖ్యత ను తెలియజేస్తూ ,యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని,తద్వారా ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా ముందుగానే రోగాలు రాకుండా ఉపయోగపడుతుంది అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ దివ్య ,ఫార్మసిస్ట్ సరోజా హెచ్ ఈ ఓ చంద్రశేఖర్,H.V. యశోధ,యోగ ఇన్స్టక్టర్స్ నాగార్జున, గీతదేవి ఆసుపత్రి సిబ్బంది మరియు పేషెంట్స్ పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్