(శంకరపట్నం డిసెంబర్ 23)
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది..
వివరాల్లోకి వెళితే, బొల్లం లచ్చవ్వ కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు కాగా భర్త, ఒక కుమారుడు, ఒక కూతురు చనిపోగా, పెద్ద కుమారుని కొడుకు కొన్ని రోజులు, చిన్న కుమారుడు కొన్ని రోజులు లచ్చవను చూసుకునే బాధ్యతలను పంచుకోవడం జరిగింది..
ఈ క్రమంలోి పెద్ద కుమారుని సమయము అయిపోగా తాడికల్ గ్రామంలో తమ్ముని ఇంటి వద్ద దిగబెట్టి వెళ్ళిపోయారు కానీ చిన్న కుమారుడు అయిన బొల్లం సమ్మయ్య తల్లిని రేకుల షెడ్డులో వదిలివేసి వెళ్లిపోయాడు..
ఆ తల్లికి నడవడం రాదు ఆ తల్లికి చెవులు వినబడవు చలికి గజగజ వణుకుతూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తుంది..
నవ మాసాలు మోసి కని పెంచి అనురాగాలు ఆప్యాయతలు పంచి పెద్ద చేసిన కొడుకులు ఈ విధంగా వదిలివేయడం ఆలనా పాలనా చూసుకోక పోవడంతో గ్రామంలోని ప్రజలు నానా రకాలుగా చర్చించుకుంటున్నారు..
కన్నతల్లిని చూడనటువంటి కొడుకును తక్షణం అరెస్టు చేసి జైల్లో పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు…




