శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో
ధనుర్మాస మహోత్సవాలు
శనివారం ఉదయం 6:00 గంటల నుండి ఉత్తర ద్వారా దర్శనం
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్య భామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ నెల 17 వ తేదీ ఆదివారం నుండి జనవరి 14 వ తేదీ ఆదివారం వరకు ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమీటీ అద్యక్షులు గడ్డం జితేందర్ , ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్ లు తెలిపారు, ఆలయ ప్రధాన అర్చకులు బిట్కూరి నవీన్ చారి వెల్లడించారు,
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం 23వ తేదీన ఉదయం 6 గంటల నుండి ఉత్తర ద్వారా దర్శనం , జనవరి 4వ తేదీన గురువారం దీపోత్సవ కార్యక్రమం, 9 వ తేదీన మంగళవారం మంగళ శాసనం ,10 వ తేదీ బుధవారం రేపల్లె వేడుకలు , 11వ తేదీ గురువారం అలంకరణ సారే, 12 వ తేదీ శుక్రవారం ఉదయం 10:30 గంటలకు శ్రీ గోదా రంగనాథ భగవానుల తిరు కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరప బడునని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమీటీ అద్యక్షులు గడ్డం జితేందర్ , ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్ లు తెలిపారు,
