133 Views

ముస్తాబాద్/సిరిసిల్ల/అక్టోబర్ 26 ముస్తాబాద్ మండల కేంద్రంలో పోలీస్ విధి విధానాల గురించి ఎస్ ఐ మాట్లాడుతూ…!
ప్రజల సేవ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారి త్యాగాలను స్మరిస్తూ ఉండాలని అన్నారు….ఫ్లాగ్ డే లో భాగంగా నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులకు ఆయుధాల గురించి, పోలీసు చట్టాల గురించి, సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాల గురించి, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి మరియు సైబర్ నేరాల గురించి డయల్ 100,షీ టీమ్ గురించి,పోలీస్ విధులు మరియు పోలీసులు ఉపయోగిస్తున టెక్నాలజీ, పోలీస్ స్టేషన్ ఆవరణ, ఎస్హెచ్ఓ రూమ్, స్టేషన్ రైటర్, లాక్ అప్స్, రిసెప్షన్, ఇన్చార్జి రూమ్, టెక్ టీం రూమ్, తదితర పరిసరాలను మరియు విహెచ్ఎఫ్ వైర్లెస్ సెట్ విభాగం గూర్చి చూపించి పోలీస్ అధికారులు నిర్వహిస్తున్న విధుల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. ఈకార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్లతో పాటు కానిస్టేబుల్ కుమార్, రాజు, తదితరులు కానిస్టేబుల్స్, ప్రభుత్వ పాఠశాల విద్య బోధకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.