వేములవాడ రూరల్ మండలం పోశెట్టిపల్లి వద్ద మంగళవారం జరిగిన ఆటో ప్రమాదంలో గాయపడిన… వేములవాడ, సిరిసిల్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో పాటు మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరామర్శించారు.
గాయపడిన
వారిని యోగక్షేమాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కోరారు.
దురదృష్టవషత్తు ఆటో ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చేస్తానని విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు…
