రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల పట్టణం లోని స్థానిక ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పశుల .కృష్ణ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
సిరిసిల్లాను ఆనుకుని ఉన్న ఏడు గ్రామాలను మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అకారణంగా మున్సిపల్ విలీనం చేశాడని అన్నారు. దీనివల్ల విలీన గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సిరిసిల్ల అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల మున్సిపల్ లో కలిసిన విలీన గ్రామాలను గ్రామపంచాయితీలుగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. విలీన గ్రామాలను తిరిగి గ్రామపంచాయితీలుగా ప్రకటించేందుకు కేకే మహేందర్ రెడ్డి అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని,అన్నారు. నిన్న జరిగిన సభలొ విలీన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా ప్రకటించేందుకు కృషి చేస్తానని కేటీఆర్ అనడం సిగ్గుచేటని, అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం విలీన గ్రామాలను, గ్రామ పంచాయితీలుగా ప్రకటిస్తారేమోనని ఆ ప్రాధాన్యత కాంగ్రెస్ దక్కకుండా కేటీఆర్ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడని అన్నారు.
