ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు9, గూడూరు గ్రామంలో సర్పంచ్ సాకలి రమేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హోమియో డిస్పెన్సరీ వైద్యాధికారి శశిప్రభ ఆరోగ్య శిబిరం ఏర్పాటుచేసి కరదీపికలు ఆవిష్కరించారు. ఈసందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ వర్షాకాలం వాతావరణం ప్రభావంవలన సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆయుష్ హోమియో ప్రభుత్వ డిస్పెన్సరీ ద్వారా వైద్యాధికారి శశిప్రభ నేతృత్వంలో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి కరదీపికలు ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈవ్యాధులు ఒకరి నుండి ఒకరికి షరవేగంగా వ్యాపించే కండ్ల కలక దగ్గు జలుబు విషజ్వరాలతోవచ్చే అంటు వ్యాధులపై అవగాహన కల్పింపచడంతోపాటు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి ఉచిత మందులు పంపిణీ చేశామని తెలిపారు. గ్రామప్రజలు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈకార్యక్రమంలో వైద్య సిబ్బంది రాజేశ్వర్, లక్ష్మయ్య, రజిత, ఆశావర్కర్ విజయ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



