Breaking News నేరాలు ప్రాంతీయం

ఇసుక మాఫియా తో మీడియేటర్ వకల్తా పుచ్చుకొని బెదిరింపులు..,!!

394 Views

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విచ్చలవిడిగా సమయం దాటిన ఇసుక మాఫియా జోరుగా దందాను కొనసాగిస్తున్నారని వార్త రావడం పట్ల బెంబేలెత్తుతున్నారు. కాగా విషయమేంటంటే ఓ వ్యక్తి మీడియేటర్ గా వచ్చి నీ గురించి బాగా వినపడుతుందని జాగ్రత్తగా ఉండమని చెప్పడం పట్ల బెదిరించినట్లే అవుతుందని సదరు విలేకరి చెప్పారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న విలేకరులకు భద్రత లేకుండా పోతుందని జిల్లామానవ హక్కుల కోఆర్డినేటర్ జగదీష్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు తల ఒగ్గెడి లేదని మండిపడ్డారు. విశేషమేంటంటే సహసర వ్యక్తి కూడా తన తరఫున మాట్లాడకుండా తోటి విలేకరి అని చూడకుండా నీకు బెదిరింపులు వస్తున్నాయంటూ చురకలు అంటించి వెళ్లారు. జన సరిగా రోజు వార్తలు కొట్టే క్రమంలో హెచ్చరించుకోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు. కొంతమంది ఇంటికి వచ్చి మరి చెప్పడంతో కంగు తినడం విలేఖరి వంతు అయింది. ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ లో విచారించి ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని భవిష్యత్తులో ఏమైనా ప్రమాదాలు సంభవించిన ప్రాణహాని తలపెట్టినా వారే బాధ్యులు అవుతారని వారు ఎవరో తెలిసి కూడా తెలియకుండా ప్రవర్తించడం పట్ల సిగ్గుచేటు అన్నారు. మరోసారి ఇలాంటి ఘటన లు పునర్వృత్తం అయితే పోలీసులకు తప్పకుండా ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని నిజాలు నిర్భయంగా రాయడం జర్నలిస్ట్ వంతు అవుతుందన్నారు. కొందరు ముసుగులో వచ్చిపోతే ప్రజలు తప్పకుండా చూస్తున్నారని తమ వద్ద అన్ని ఆధారాలతో సహా ఉన్నాయని అన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *