సంక్రాంతి పర్వదినం సందర్బంగా మండల వ్యాప్తంగా అందమైన ముగ్గులతో వాకిళ్ళు తీర్చిదిద్దగా పల్లెలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. వాకిళ్లలో రేగి పళ్లు, గోబ్బేమ్మలు పెట్టి నవ ధాన్యాలతో అలంకరించారు. పిల్లలు బొమ్మరిల్లు కట్టి, గురుగులలో ప్రసాదం వండి పంచి పెట్టారు. సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా మండల వ్యాప్తంగా జరుపుకున్నారు.





